’90 ఎంఎల్’ టీజర్‌ తేదీ ఖరారు..

629
- Advertisement -

టాలీవుడ్‌లో కార్తికేయ హీరోగా చేసిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా యూత్‌లో ఆయనకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత హీరోగా ఆయన చేసిన సినిమాలేవీ అంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాలోని విలన్ పాత్ర మాత్రం ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తాజాగా 90 ఎంఎల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న నేహా సోలంకి నాయిక‌గా న‌టిస్తున్నారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

90 ML movie

ఈ చిత్ర టీజ‌ర్ సెప్టెంబ‌ర్ 21 ఉద‌యం 10.35 ని.ల‌కి విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్ . పోస్ట‌ర్‌లో కార్తికేయ మొక్క‌కి మందు పోస్తుండ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి కాగా, అతి త్వ‌ర‌లో మిగ‌తా పార్ట్ పూర్తి చేసి సినిమాని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహ‌లు చేస్తున్నారు. చిత్రానికి 90 ఎంఎల్ అనే టైటిల్ ఎందుకు పెట్టామ‌న్న‌ది సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంద‌ని చెబుతుంది చిత్ర‌బృందం.

- Advertisement -