’90 ఎం.ఎల్.’ ఇది చాలా తక్కువ..

289
90ml Telugu Movie

ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథాంశంతో 90 ఎం.ఎల్. ఇది చాలా తక్కువ చిత్రాన్ని రూపొందించారు. తమిళంలో ఇదే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఒవియా ప్రధాన పాత్రలో నటించగా… ప్రముఖ హీరో శింబు ప్రత్యేక ఫాత్రలో నటించడంతో పాటు సంగీతాన్ని అందించారు. అనితా ఉదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కర్ణ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై యిన్నం శ్రీనివాసరావు సమర్పణలో కృష్ణ కాకర్లమూడి నిర్మాణ సారధ్యంలో నిర్మాత పపఠాన్ చాంద్ బాషా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

కాగా ఈ చిత్రం ఆడియో వేడుక శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. అతిథులుగా విచ్చేసిన తుమ్ములపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, సంతోషం సురేష్ ఆడియో సీడీలను ఆవిష్కరించగా…తొలుత ఒక్కో పాటను ఒక్కో అతిథి విడుదలచేశారు. థియేట్రికల్ ట్రైలర్ ను చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రలలో నటించిన నటీమణులు మసూమ్ శంకర్, బొమ్ములక్ష్మి, శ్రీ గోపిక విడుదలచేశారు.

90ml Telugu Movie

ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, సంతోషం సురేష్ మాట్లాడుతూ, తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రమిది. యూత్ ను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. పాటలు, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరింపజేస్తుందని అనుకుంటున్నాం అని అన్నారు.

చిత్ర నిర్మాత పఠాన్ చాంద్ బాషా మాట్లాడుతూ, వల్లర్ సన్నివేశాలు ఇందులో లేవు. యూత్ ను దృష్టిలో పెట్టుకుని సందేశాన్ని అందిస్తూ రూపొందించిన చిత్రమిది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వెన్నెలకంటి తనయుడు రాకేందుమౌళి సాహిత్యానికి శింబు అందించిన సంగీతం హైలైట్ అవుతుంది. ఈ నెల 26న సినిమాను భారీగా విడుదల చేస్తున్నాం అని చెప్పారు.

90ml Telugu Movie

నిర్మాణ సారధి కృష్ణ కాకర్లమూడి మాట్లాడుతూ, ఐదుగురు అమ్మాయిలు జీవితాలలో ఎదురైన సమస్యల వల్ల వారంతా మధ్యపానం, ధూమపానంకు బానిసలవుతారు. ఆ తర్వాత వాళ్ల తప్పు తెలుసుకుని ఎలా బయటపడ్డారన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రమిదని అన్నారు. ఒవియాతో పాటు మిగతా పాత్రధారులంతా తమ పాత్రలలో ఒదిగిపోయారని చెప్పారు. ఇంకా ఈ వేడుకలో నటుడు విజయరంగరాజు, ఫైనాన్షియర్ మల్లికార్జున్, రంగనాయకులు, కరుణాకర్, రాము తదితరులు పాల్గొన్నారు.