కార్తీ చిదంబ‌రం అరెస్ట్

241
- Advertisement -

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్న సీబీఐ అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 2న మనీలాండరింగ్ కేసులో అధికారులు ఆయనకు సమన్లు జారీ చేశారు.కార్తీ చిదంబ‌రంతో స‌న్నిహితుల ఇళ్ల‌పై ఇటీవ‌లె దాడులు నిర్వ‌హించిన ఈడీ మూడు ప్రాంతాల్లో సోదాలు చేప‌ట్టింది.ఇప్పటికే రెండుసార్లు ఈడీ ముందుకు కార్తీ హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మద్రాసు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ కార్తి పిటిషన్లు వేశారు.

Karti Chidambaram arrested

కార్తీతో పాటు ఐఎన్‌ఎక్స్‌ మీడియా డైరెక్టర్స్‌ పీటర్‌ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణీ ముఖర్జియాపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇంద్రాణీ, పీటర్‌ ముఖర్జీయాలకు చెందిన ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు దొడ్డిదారిలో అనుమతులు మంజూరు చేయించినట్టు కార్తిపై ఆరోపణలున్నాయి. 2007లో అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం ఈ మీడియా సంస్థకు క్లియరెన్స్‌ ఇచ్చారు. చిదంబరం, ఆయన కుమారుడు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ కేసు నమోదు చేసింది.

ఇక ఇదే కేసులో కార్తీ చిదంబరం చార్టెడ్‌ అకౌంటెంట్‌ (సీఏ) ఎస్‌. భాస్కర్‌ రామన్‌ను ఈడీ అరెస్ట్‌ చేసిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -