నాని ‘జెర్సీ’లో మ‌హాన‌టి?

462
Keerthy-Suresh-Nani
- Advertisement -

వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న నానికి కృష్ణార్జున యుద్దం సినిమాతో బ్రేక్ ప‌డింది. ఈసినిమా ప‌రాజ‌యం పొంద‌టంతో త్రిపుల్ హ్యాట్రిక్ ను మిస్స‌య్యాడు నాని. ఇక నాని ప్ర‌స్తుతం బిగ్ బాస్ 2లో హోస్ట్ గా చేస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌కత్వంలో నాగార్జున‌, నాని హీరోలుగా ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా రూపొందుతోంది. ఈసినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ సగం వ‌ర‌కూ షూటింగ్ ను పూర్తి చేసుకున్న‌ట్లు తెలిపారు.

nani, keerthy suresh

ఈసినిమా షూటింగ్ జ‌ర‌గుతుండ‌గానే మ‌రో సినిమాకు సైన్ చేశాడు నాని. మ‌ళ్లి రావా సినిమా డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరితో నాని జెర్సీ అనే సినిమాను చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. ఇటివ‌లే ఈమూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈసినిమాలో నాని క్రికెట‌ర్ గా క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈమూవీ కోసం నాని ప్ర‌త్యేకంగా క్రికెట్ లో శిక్ష‌ణ తీసుకుంటోన్నాడు.

Nanis-Jersey

ఇక చిత్రంలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు ద‌ర్శ‌క, నిర్మాత‌లు. కీర్తి సురేష ను తీసుకుంటే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు చిత్ర‌బృందం. ఈసంద‌ర్భంగా కీర్తి సురేష్ ను సంప్ర‌దించి అడిగిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకు కీర్తి సురేష్ కూడా సైన్ చేసిన‌ట్టు స‌మాచారం. గ‌తంలో వీరిద్ద‌రి క‌లిసి చేసిన నేను లోక‌ల్ సినిమా ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా కీర్తి న‌టించిన మ‌హాన‌టి సినిమాకు పెద్ద ఎత్తున స్పంద‌న రావ‌డంతో కీర్తి ని హీరోయిన్ గా పెడితే కొంచెం ప్ల‌స్ గా మారుతుంద‌ని అనుకుంటున్నారు జెర్సీ బృందం.

- Advertisement -