‘కార్తికేయ‌-2’..స‌రికొత్త రికార్డు

76
- Advertisement -

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం దాదాపు రూ. 100 కోట్లు వసూళ్లు చేసింది. విడుదలైన ప్రతీచోటా మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

యుఎస్‌లో 1.5 మిలియ‌న్ డాల‌ర్ల వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా నాలుగో వారంలో 80 పైగా లోకేష‌న్ల‌లో ర‌న్ అవుతున్న‌మొద‌టి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. అడ్వేంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

నిఖిల్‌కు జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌ణ్ హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు.

- Advertisement -