‘బ్ర‌హ్మ‌స్త్ర’ మేకింగ్

144
ranbir
- Advertisement -

స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్‌కపుల్ ర‌ణబీర్ క‌పూర్ , ఆలియా భ‌ట్ జంట‌గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్రం “బ్రహ్మాస్త్ర” . తెలుగులో “బ్రహ్మాస్త్రం” పేరుతో దీనిని విడుదలచేయనున్నారు. ఈ చిత్రం లో అమితాబ్ బ‌చ్చన్ , హీరో నాగార్జున కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని సెప్టెంబర్ 9న హిందీ వెర్షన్ తో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు

ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, ట్రైల‌ర్‌ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. తాజాగా చిత్ర‌బృందం బ్ర‌హ్మ‌స్త్ర మేకింగ్ వీడియోను విడుద‌ల చేశారు. ఈ వీడియోలో చిత్రం కోసం మేక‌ర్స్ ఎంత‌గా శ్ర‌మించారో క‌నిపిస్తుంది.

ఈ సినిమాతో ర‌ణ్‌బీర్ తెలుగులో మంచి మార్కెట్‌ను ఏర్ప‌రుచుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మూడు భాగాలుగా తెరకెక్కగా మొద‌టి భాగం ‘శివ’ పేరుతో విడుద‌ల కానుంది.

- Advertisement -