కార్తీక పౌర్ణమి.. ఆలయాలకు భక్తుల రద్దీ..

359
karthika-pournami
- Advertisement -

కార్తీక మాసంలో శుక్లపక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పున్నమి. ఈ కార్తీక పౌర్ణమి శివ, కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆలయాలకు బారులు తీరారు. భద్రాచలం గోదావరి నది వద్ద భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు వేకువజామున నుంచి పాతాళగంగలో కార్తీక పుణ్య స్నానాలాచరించి గంగమ్మ ఒడిలో కార్తీక దీపాలను వదులుతూ మొక్కులు తీర్చుకుంటున్నారు.

Karthika-Masam

అదేవిధంగా జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే తుంగభద్ర నది తీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీశైలం ఆలయంలో ముత్తైదువలు మహిళలు భక్తులు కార్తీక దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో మొక్కలు తీర్చుకుంటున్నారు.

- Advertisement -