భారీగా పడిపోయిన పసిడి ధర..

537
gold rate
- Advertisement -

పసిడి ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో గత మూడు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.300 పడిపోయింది. ఈ రోజు మంగళవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది.అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

gold

వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,100, విజయవాడలో రూ.38,850, విశాఖపట్నంలో రూ.39,290, చెన్నైలో రూ.37,990గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,320, విజయవాడలో రూ.36,000, విశాఖపట్నంలో రూ.36,140, చెన్నైలో రూ.36,360గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,100, విజయవాడలో రూ.45,600, విశాఖపట్నంలో రూ.45,600, చెన్నైలో రూ.47,700 వద్ద ముగిసింది.

- Advertisement -