కార్తీక దీపం..నిజాన్ని రాబట్టేందుకు కార్తీక్‌ అష్టకష్టాలు..!

249
karthik
- Advertisement -

బుల్లితెర పాపులర్ షో కార్తీక దీపం విజయవంతంగా 1088 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. శుక్రవారం ఎపిసోడ్‌లో భాగంగా ఓ వైపు కార్తిక్ తాను తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు ప్రియమణి, భాగ్యను కలవగా కార్తీక్‌ కోసం దీప,ఆదిత్య ఓ లాయర్‌ని సంప్రదిస్తారు. అయితే దీప- ఆదిత్య లాయర్‌ని సంప్రదించారని తెలుసుకున్న మోనిత…భయంతో వణికిపోగా భాగ్య…కార్తీక్‌కు ధైర్యం చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

ముందుకు కార్తీక్‌…నిజాన్ని బయటకు తీసే క్రమంలో భాగంగా ప్రియమణిని కలుస్తాడు. తాను మోనితతో ఎప్పుడు తప్పుడగా ప్రవర్తించలేదని తన బాధను చెప్పుకుని ఆ రోజు రాత్రి అసలేం జరిగిందని చెప్పాలని ప్రియమణిని కోరుతాడు. ప్రియమణి కార్తీక్‌తో.. అమ్మా ఇక్కడికి వచ్చి పడుకున్నారు.. ఇప్పటి దాకా మీ రూమ్‌లోనే ఉన్నారు.. అని చెప్పబోతుంటే ఆ రోజు ఉదయాన్నే మోనిత చెప్పొద్దని సైగ చేసిన సీన్ గుర్తొస్తుంది. అయితే వెంటనే కార్తీక్ అయ్యా మీరంతా పెద్దవాళ్లు.. మీ గురించి నాకేం తెలుస్తుంది.. నేను వంట మనిషిని.. అంటూ అబద్దం చెప్పేస్తుంది. ప్రమాణపూర్తిగా నాకేం తెలియదు కార్తీక్ అయ్యా అంటూ తన మీద ఒట్టుపెట్టుకుంటుంది ప్రియమణి.

ఇక దీప, ఆదిత్యలు ఓ లాయర్‌ని కలవగా ఆ ఇంటిలోంచి రావడం చూసిన మోనిత కారు పక్కకు ఆపుతుంది. దీప ఎక్కడికి వెళ్లింది అని తెలుసుకునే క్రమంలో భాగంగా లాయర్ ఇంటికి వెళ్లిందని తెలుసుకుని..అంటే దీప కార్తీక్ కోసంపోరాటం మొదలుపెట్టిందా.? నాకు న్యాయం జరగకూడదని లాయర్‌ని సంప్రదించడానికి వచ్చిందా’ అంటూ తనలో తనే అల్లాడిపోతుంది.

ఇక సీన్ కట్ చేస్తే తర్వాత భాగ్యం ఇంటికి వెళ్తాడు కార్తీక్. మీరు నన్ను చూసి భయపడుతున్నారు.. ఇంటికి వచ్చిన మనిషిపైన గౌరవమే ఉండాలి కానీ భయం ఉండకూడదు.. కానీ ఆ గౌరవాన్ని నేను ఎప్పుడో పోగొట్టుకున్నాను అంటాడు కార్తీక్ బాధగా. కొన్నేళ్లు నా కళ్లు మూసుకునిపోయాయి.. మిమ్మల్ని మురళీ కృష్ణగారిని తక్కువ చేసి మాట్లాడేవాడ్ని.. అవన్నీ మీరు మరిచిపోయి ఉండొచ్చు.. అన్నింటికి క్షమాపణగా ఒక్క నమస్కారం పెట్టాను అని చెబుతాడు కార్తీక్.

దీప ఎంత పవిత్రమైనదో మీ మనసు కూడా అంతే పవిత్రమైనది.. ఆ మోనితేంటో నాకు తెలుసు.. ఆ మోనితకి బుద్ది చెప్పడానికి నేనేం చెయ్యాలో అది చేస్తాను బాబు అని ధైర్యం చెబుతుంది భాగ్యం. వెంటనే కార్తీక్ సరే అన్నట్లు.. దన్నం పెట్టి వెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే పిల్లలు ఇద్దరూ తండ్రి కొన్న బట్టల్లోనే ఫ్యాషన్ షో చేస్తూ ఉంటారు. అది చూసి దీప షాక్ అవుతుంది. నవ్వు ఆపుకుంటున్నట్లుగా కళ్లు పెద్దవి చేసి చూస్తుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్ వస్తాడు. గుమ్మం దగ్గర నిలబడి గమనస్తాడు.. దీప చూసుకుని పిల్లలు ఇద్దరూ సిగ్గపడి ముఖాలని చేతులతో మూసుకుంటారు. కాసేపటికి ఓరాగా చూస్తూ దీపని చూడటంతో ముగ్గురు ఒక్కటే సారి పక్కన నవ్వుతారు. దీప కూడా పెద్దగా నవ్వేస్తుంది. కార్తీక్ అది చూసి మురిసిపోతాడు.

- Advertisement -