యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

37
ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్…ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించనున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాంకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. ఆట నాది గెలుపు మీది అంటూ వస్తున్న ఈ షో షూటింగ్‌లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌కు బ్రేక్ రావడంతో వారం రోజుల పాటు ఈ కార్యక్రమానికి టైం కేటాయించిన ఎన్టీఆర్… జులై 20 నుంచి తిరిగి ఆర్ఆర్ఆర్ సినిమా పాట చిత్రీకరణలో పాల్గొననున్నారని సమాచారం.

తెలుగు బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్…ఆ షో ఎక్స్‌పీరియన్స్‌తో ఇప్పుడు ఎవరు మీలో కోటిశ్వరుడు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే ఈ షో ప్రసారం కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.