కార్తీకదీపం:నిజం తెలిసాక కార్తీక్ హిమనీ దూరం పెడ్తాడా?

288
karthika deepam
- Advertisement -

బెల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సీరియల్స్‌లో ఒకటి కార్తీక దీపం. ఇప్పటివరకు 913 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుందంటే ఈ షోకి ఉన్న క్రేజ్‌ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక 913వ ఎపిసోడ్‌లో భాగంగా హిమ దీప కూతురనే విషయాన్ని తెలుసుకున్న కార్తీక్‌ ..తాను చేసిన తప్పును తెలుసుకుని కుమిలి కుమిలి ఏడుస్తాడు.

ఓ కాలువ దగ్గర కూర్చుని.. దీప మాటలు, హిమ మాటలు, సౌర్య మాటలు, సౌందర్య మాటలు అన్నీ తలుచుకుంటూ.. అన్నింటినీ ఒకదానికి ఒకటి సింక్ చేసుకుంటూ ఏడుస్తాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి..? ఏం నిర్ణయం తీసుకోవాలి అంటూ దుఖంతో అల్లాడిపోతాడు.

దీప ఇంటికి వెళ్లినప్పుడు మౌనితని దీప కొట్టింది కాబట్టి..ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను అనుకుంటూ దీప దగ్గరకు ఆవేశంగా వస్తుంది మౌనిత. ఏంటి నా దవడ వాయిద్దాం అనుకున్నావా.. నువ్వు ఆ పని చెయ్యలేవు.. నీకు ఆ ధైర్యం లేదులే..’ అంటూనే ‘ఏయ్ చెంచా(ప్రియమణి).. ఇక్కడ నుంచి వెళ్లవే అనగానే లోపలికి వెళ్లిపోతుంది ప్రియమణి.

సీన్ కట్ చేస్తే.. హిమా.. నిన్న నైట్ నాన్న ఫోన్ చేశారు. నిన్ను తీసుకుని వెళ్లడానికి ఈ రోజు ఉదయం వస్తానని అన్నారు.. చెప్పడం మరిచిపోయాను’ అనడంతో.. హిమ.. అవునా.. నన్ను మిస్ అవుతున్నాట్లు ఉన్నారు డాడీ అనడంతో.. దీప విని బాధపడుతుంది.

- Advertisement -