కార్తి మూవీకి ప్రత్యేకంగా జైలు సెట్ చేశారు‌..

134
Sardar
- Advertisement -

తమిళ హీరో కార్తి వైవిధ్యభరితమైన సినిమాలతో దూసుకుపోతున్నాడు. కార్తి ప్రస్తుతం ‘సర్దార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కార్తి జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలాకాలం నుంచి జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఒక ఖైదీగా ఈ పోస్టర్లో కార్తి కనిపిస్తున్నాడు.

ఈ కథలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు జైల్లోనే జరుగుతాయట. అంటే కథలో కీలకమైన మలుపులు జైలును కేంద్రంగా చేసుకుని నడుస్తాయన్న మాట. అందువలన ప్రత్యేకంగా జైలును .. దానికి అనుసంధానం చేయబడిన సెట్లను వేయిస్తున్నారట చిత్ర బృందం. ఇందుకుగాను 2 కోట్ల రూపాయాలకు పైగా ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, సాధ్యమైనంతవరకూ సెట్లలోనే షూటింగును కానిచ్చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

- Advertisement -