హీరో కార్తి ‘సర్దార్‌’ ఫస్ట్ ‌లుక్ అదిరింది‌..

102

హీరో కార్తి తదుపరి చిత్రం టైటిల్‌ ‘సర్దార్‌’గా ఖరారైంది. పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కార్తి ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా టైటిల్‌తో పాటు హీరో ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ ఆదివారం రోజున విడుదల చేసింది. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేస్తున్నారు.

ముసలి గెటప్‌ కార్తి లుక్ ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంటోంది. వయసుకు భిన్నమైన గెటప్‌లో కార్తి కనిపిస్తాడనే విషయం ఈ ఫస్ట్‌లుక్‌ చూస్తే స్పష్టమవుతుంది. మోషన్‌ పోస్టర్‌ను చూస్తుంటే సినిమా భారత్‌, చైనా, పాకిస్థాన్‌ దేశాల మధ్య నడిచే కథలా అనిపిస్తుంది.

Sardar [Tamil] - Official Motion Poster | Karthi | PS Mithran | GV Prakash | Prince Pictures