టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి- మంత్రి

94
minister satyavathi

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 12వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కావేటి కవితకి మద్దతుగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదివారం దేశాయిపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎన్నికలు రాగానే వచ్చే పార్టీలకు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న తేడాను మీరే గుర్తించి ఓట్లు వేయండని అన్నారు.

కరోనా కాలంలో ప్రజలకు సేవ చేస్తూ కవిత భర్త, ఉద్యమ కారుడు రాజు కరోనాతో మరణించారు. ఆమె భర్త ఆశయం కోసం కవిత అభ్యర్థిగా మీ ముందుకు వచ్చారు. కాబట్టి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మీ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రూ.600 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ అభివృద్ధి మరింతగా కొనసాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.