వదినను అక్కా అని పిలుస్తున్న కార్తీ..!

431
karthi donga

ఖైదీతో హిట్ అందుకున్న హీరో కార్తీ తాజాగా దొంగగా వస్తున్నాడు. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తమిళంలో తంబిగా తెలుగుతో దొంగగా రిలీజ్ కానుంది. తన కెరీర్‌లో తొలిసారి వదిన జ్యోతికతో కలిసి నటిస్తున్నాడు.

డిసెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా మూవీ ప్రమోషన్‌లో భాగంగా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను హీరో సూర్య రిలీజ్‌ చేశారు.ఒకవైపు కార్తి, మరోవైపు జ్యోతిక ముఖాలు పెట్టి మధ్యలో పోలీస్ జీపు ఉంచారు. ఇక ఈ సినిమాలో కార్తీకి అక్కగా నటించనుంది జ్యోతిక. ఈ సందర్భంగా మాట్లాడిన కార్తీ ఏడాదిగా ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రం తెరకెక్కిన విధానం చాలా సంతృప్తికరంగా ఉంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందనుకుంటున్నాను అన్నారు.

వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సమర్పణలో ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై సూరజ్‌ సదానా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం సమకూరుస్తున్నారు.

ఖైదీతో మంచి విజయాన్ని అందుకున్న కార్తీ….. తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరారు. కార్తీ హీరోగా ఇటీవల వచ్చిన ‘ఖైదీ’, ఇప్పుడు ‘దొంగ’ టైటిల్స్‌ చిరంజీవి నటించిన సినిమా టైటిల్సే కావడం విశేషం.