మిస్టర్‌కూల్‌ వచ్చేస్తున్నాడు..!

392
dhoni

వరల్డ్ కప్‌ తర్వాత క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చిన మహేంద్ర ధోని తిరిగి జట్టులో చేరనున్నాడు. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోని…బ్యాట్‌తో మెరిశాడు. నెట్స్‌లో ధోని జార్ఖండ్ బౌలర్లు సంబంధించిన బంతులను ఎదుర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

గంగూలీ బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ధోని భవితవ్యంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఇక ధోని క్రికెట్‌కు గుడ్ బై చెప్పక తప్పదని వార్తలు వెలువడ్డాయి. అయితే వాటికి పుల్ స్టాప్ పెడుతూ ప్రాక్టీస్ మొదలెట్టాడు మహీ. దీంతో ధోనీ విండీస్‌ పర్యటనకు ఎంపికయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని మాజీలు అభిప్రాయపడుతున్నారు.