ఖైదీ నటుడు స్పష్టత…మొదలయ్యేది ఎప్పుడంటే?

70
kaidhi
- Advertisement -

కోలీవుడ్‌లో సీక్వెల్‌ సినిమాలు సందడి నెలకొంది. 2019లో వచ్చిన ఖైదీ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని హీరో కార్తి తెలిపారు. ఇది వచ్చే ఏడాది పట్టాలెక్కబోతున్నట్లు కూడా ప్రకటించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్‌ సెల్వన్‌ 1ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తిని ఖైదీ2గురించి అడగ్గా ఆయన స్పందించారు. వచ్చే ఏడాది మొదలు పెడతామని తొలి భాగంతో పొలిస్తే ఈ సారి బడ్జెట్‌ కూడా భాగా పెంచామని తెలిపారు.

కార్తి కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం నమోదు చేసుకుంది. ప్రస్తుతం లోకేశ్‌ విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన వేంటనే ఖైదీ2ను మొదలవుతుందని కోలీవుడ్‌ సమాచారం

- Advertisement -