ఉత్తమ్‌ను జంతువు కూడా పట్టించుకోదు: కర్నె ప్రభాకర్

363
Karne Prabhakar
- Advertisement -

నిన్న నల్గొండ మీటింగ్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తలా తోకా లేని మాటలు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నమే సోయితప్పి మాట్లాడారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఎద్దేవ చేశారు. అధికారిక కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిసమర్యాద లేకుండా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఉత్తమ్ తీరును కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం అసహించుకుంటున్నారు. ప్రభుత్వానికి సలహాలు-సూచనలు ఇవ్వకుండా ప్రతినిమిషం రాజకీయం చేస్తున్నారు అని కర్నె విమర్శించారు.

పాడిందే పాట అన్నట్లు గత ఆరేళ్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి-రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో మా వైఖరి స్పష్టం చేశాం. రాష్ట్రంలో ఎక్కడ ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు అని నిరూపించండి-కల్లాల్లో ధాన్యం ఉందా? అని కర్నె ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంట్లో పోరు ఎక్కువ అయిందని ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి అమరుల గురించి మాట్లాడితే నవ్విపోదురు గాక నాకేమి సిగ్గు అన్నట్లు ఉంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఇంకా మర్చిపోనట్టున్నరు. అందుకే కేసులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లను నడక నేర్పింది టీఆరెస్ ప్రభుత్వం అనేది మర్చిపోవద్దు! అన్నారు. మేము అభివృద్ధి చేసాము కాబట్టే ప్రజలు మావెంట ఉన్నారు! ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేస్తే ఆయన్ని జంతువు కూడా పట్టించుకోదు అని కర్నె ప్రభాకర్‌ తెలిపారు.

- Advertisement -