తెలంగాణ దేశానికే రోల్ మోడల్: మంత్రి జగదీష్ రెడ్డి

177
Jagadish Reddy
- Advertisement -

సీఎం కేసీఆర్ ముందు చూపు దార్శనికతతో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గ్ నిలిచిందని అన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన నియంత్రిత సాగు కార్యాచరణ సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న నియంత్రిత సాగు విధానం రైతులను ధనవంతులను చేస్తుందని మంత్రి అన్నారు.

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందని,ఎన్నో విజయాలతో తెలంగాణ దూసుకుపోతుందని అన్నారు. ఈ సారి కూడా సకాలంలో వర్షాలు కురిసి,కాలం కలిసి వచ్చి పాడి పంటలు వర్ధిల్లి రైతాంగం సంతోషంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.

అంతకు ముందు యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో జిల్లా సహకార బ్యాంకు రైతులకు నిర్వహించిన రుణ మేళాను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యురాలు,ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ లింగయ్య యాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -