ప్రస్తుతం ఏ రంగంలో చూసినా మహిళలకు రక్షణ లేకుండపోయింది. ఎక్కడ చూసినా మహిళలకు వేధింపులు ఎదురౌతున్నాయి. మృగాడు రెచ్చిపోతున్నాడు. కొంత మంది మహిళలు వారికి జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా బయటికి చెప్సి వేధించిన వాడి భరతం పడుతున్నారు. అలాటి ఓ సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. కర్ణాటకలోని దేవనాగరిలో నిన్న చోటు చేసుకోగా ఇవాళ వెలుగు చూసింది. ఇక అసలు విషయానికొస్తే ..బ్యాంకులో ఓ పని కోసం వెళ్లిన మహిళను ఆ బ్యాంకు మేనేజర్ వేధింపులకు పాల్పడ్డాడు. పని కావాలంటే తన కోరిక తీర్చాలంటూ వెర్రివేశాలు వేసిన బ్యాంకు మేనేజర్‌కు ఆ మహిళ తన శక్తి ఏంటో చూపించింది.
కోపంతో ఊగిపోయిన సదరు మహిళ.. బ్యాంకు మేనేజర్‌ను నడి రోడ్డుకి ఈడ్చుకొచ్చి.. కట్టెతో చితకబాది.. చెప్పుతో కొట్టింది. రోడ్డుమీద పరుగులు పెట్టించింది. అందరూ చూస్తుండగానే పోకిరీ మేనేజర్‌కు ఒళ్లు వాచిపోయేలా బుద్ధి చెప్పిందీ ఈ వీరవనిత. బ్యాంకు మేనేజర్‌ను మహిళ చితకబాదిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బెంగళూరులో జరిగిన ఈ ఘటన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వారికి ఒక గుణపాఠంలా మారిందని స్థానికులు అంటున్నారు.
#WATCH Woman in Karnataka's Davanagere thrashes a bank manager for allegedly asking sexual favours to approve her loan (15 October) pic.twitter.com/IiiKbiEgZ9
— ANI (@ANI) October 16, 2018