కర్ణాటక ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా లో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లను తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై రాజకీయ వర్గాల్లో మరియు సాధారణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సవరించిన ముసాయిదా జాబితాలో లక్షలాది మంది ఓటర్ల పేర్లు గైర్హాజరయ్యాయి. మరణించినవారు, వేరే ప్రాంతాలకు మారినవారు మరియు డూప్లికేట్ ఓటర్ల పేరుతో ఈ తొలగింపులు జరిగాయని అధికారులు చెప్తున్నప్పటికీ సంఖ్య అత్యంత ఎక్కువగా ఉండటం సందేహాలకు తావిస్తోంది.
బెంగళూరుతో పాటు ప్రధాన నగరాలు, పట్టణ నియోజకవర్గాల్లోనే ఈ తొలగింపుల శాతం ఎక్కువగా ఉంది. దీనివల్ల రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముసాయిదా జాబితాలో అర్హులైన నిజమైన ఓటర్ల పేర్లను కూడా సాంకేతిక కారణాలు చూపి తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారు లేదా పొరపాట్లు ఉన్నవారు సరిచేసుకోవడానికి ఎన్నికల కమిషన్ క్లెయిమ్‌లు, అభ్యంతరాల సమర్పణకు గడువు ఇచ్చింది.
Also Read:చిదంబరంకు శివరాజ్ కౌంటర్
ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో వెంటనే పరిశీలించుకుని, ఒకవేళ పేరు తొలగించబడి ఉంటే ఫారమ్-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

