బీజేపీపై విరుచుకుపడ్డ అఖిలేష్

2
- Advertisement -

మహిళా భద్రత అంశంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్. బీజేపీ నాయకులు వేదికలపై ‘నారీ వందన్’ (మహిళలను గౌరవించడం) గురించి గొప్పగా మాట్లాడుతారని కానీ ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ లాంటి దారుణమైన సంఘటనలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఆయన వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించిన అఖిలేష్ యాదవ్.. హాథ్రస్‌లో జరిగిన ఘోరకలిని గుర్తుచేశారు. మాటల్లో మహిళా సాధికారత అని చెప్తూ, చేతల్లో మాత్రం వారి భద్రతను విస్మరిస్తున్నారని బీజేపీ సర్కార్‌ను దుయ్యబట్టారు.

రాష్ట్రంలో మహిళలపై నేరాలు నిరంతరం పెరుగుతున్నాయని, నేరస్థులను అరికట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.బీజేపీ ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ మరియు ఎన్నికల లబ్ధి కోసమే పథకాల పేరిట మాట్లాడే ‘నారీ వందన్’ మాటలు ప్రచార ఆర్భాటమే తప్ప, క్షేత్రస్థాయిలో మహిళలకు లభిస్తున్న రక్షణ శూన్యమని విమర్శించారు.

మహిళల భద్రత విషయంలో ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

Also Read:చిదంబరంకు శివరాజ్‌ కౌంటర్

- Advertisement -