కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అయితే తాజాగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌కు చెందిన ఒక వాహనంలో భారీ మొత్తం వెండి వస్తువులను ఈసీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇవి ముంబాయి నుంచి చైన్నైకి తీసుకెళ్లుతుండగా కర్ణాటకలోని దావణగెరె శివారులో గల హెబ్బళ్లు టోల్ సమీపంలో ఈసీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన సరైన పత్రాలు చూపించలేకపోవడంతో వీటిని అధికారులు స్వాదీనం చేసుకున్నారు. మొత్తం 66కేజీల వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. వీటి విలువ సూమారుగా రూ.36లక్షలపైనే ఉంటుందని వెల్లడించారు.
సదరు కారు డ్రైవర్ సుల్తాన్‌ఖాన్ వాహనంలో ఉన్న మరో వ్యక్తి హరిసింగ్‌లపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు వస్తువులు పంచుతున్నారన్న ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఈసీ ప్రధానంగా దృష్టిపెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…