కర్ణాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ…నేడు కొత్త సీఎంగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈయనతో పాటుగా డీకే శివకుమార్ మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సీఎంగా సిద్దరామయ్య డిప్యూటీ సీఎంగా డీకేఎస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరితోపాటుగా ఎమ్మెల్యేలు జీ పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జర్కోలీ, ప్రియాంక్ ఖర్గే, రామలింగ రెడ్డి, బీజెడ్ జమీర్ ఆహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం.
ఈ ప్రమాణ స్వీకారంకు ఏఐసీసీ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పక్షనేతలు బీజేపీయేతర పార్టీల నాయకులు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, బీహార్ డిప్యూటి సీఎం తెజస్వీయాదవ్, ఎన్సీపీ శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లకు ఆహ్వానం పంపంగా మరికొంతమందికి ఆహ్వానం పంపలేదు.
Also Read: BRS: బిఆర్‌ఎస్ కు ‘నో పోటీ’!
వారు తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌లకు ఆహ్వానం పంపలేదు. బీజేపీయేతర శక్తులను ఎకతాటిపైకి తేవాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ .. ఈ విధమైన పక్షపాతంతో ఎలా ముందుకెళ్తుందన్న ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: CMKCR:దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ చేసింది శూన్యం