దళితుడిని అయినందుకే టార్గెట్ అయ్యా!

1
- Advertisement -

తన రాజీనామాను డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలపై కర్ణాటక మంత్రి బి. నాగేంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడినని అలాగే దళిత సామాజిక వర్గానికి చెందినవాడినైనందుకే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న పలువురు మంత్రులు, ఎంపీలపై తీవ్రమైన కేసులు ఉన్నాయి…. వారి రాజీనామాలను ఎందుకు డిమాండ్ చేయడం లేదు? ఈ రోజు మీరు నన్ను లక్ష్యంగా చేసుకోవడానికి కారణం నేను కాంగ్రెస్ పార్టీలో ఉండటం మరియు దళితుడిని కావడమే అని పేర్కొన్నారు.

వివిధ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల డేటాను ప్రస్తావిస్తూ, కిడ్నాప్, అత్యాచారం, హత్యాయత్నం మరియు లైంగిక వేధింపుల వంటి తీవ్ర నేరారోపణలు ఉన్న 126 మందితో సహా మొత్తం 326 మందిపై తీవ్ర నేర కేసులు ఉన్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను ప్రశ్నిస్తూ మొదటగా ఆ 126 మందితో రాజీనామా చేయించండి. మీ పార్టీకి చెందిన పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి (29 కేసులు ఉన్నాయి), అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వంటి వారి రాజీనామాలు తీసుకోండి. వారి రాజీనామాలు అడగకుండా, కష్టపడి క్రింది స్థాయి నుంచి పైకి వచ్చిన ఒక దళితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారు అని మండిపడ్డారు.

తనపై వచ్చిన ఆరోపణల విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించి ఉపశమనం పొందినట్లు ఆయన తెలిపారు. నేను ముద్దాయిని కానని కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం నాకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు మీరు న్యాయమూర్తి స్థానంలో కూర్చుని నన్ను నేరస్థుడిగా ప్రకటించలేరు అని తేల్చిచెప్పారు. కోర్టు నన్ను దోషిగా తేల్చితే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

కర్ణాటక ప్రభుత్వం మరియు కాంగ్రెస్ నాయకులు నాగేంద్రకు పూర్తి మద్దతుగా నిలిచారు. పారదర్శక విచారణ కోసమే ఆయన గతంలో రాజీనామా చేసి సహకరించారని, విచారణా సంస్థలు సీఐడీ ద్వారా రూ. 79 కోట్లు రికవరీ చేశాయని వారు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల వద్ద ఏదైనా ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని సవాల్ విసిరారు.

Also Read:పరకాల నాదే..కొండా షాకింగ్!

- Advertisement -