కర్నాటక ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనుండడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో విజయంపై బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండడంతో కన్నడ నాట ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒక పార్టీ నుంచి మరోపార్టీలోకి వలసలు ఏర్పడడం సర్వసాధారణం. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ రెండవసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఇతర పార్టీలలోని కీలక నేతలను ఆకర్శించేందుకు విశ్వ ప్రయత్నలే చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈసారి విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న నేపథ్యంలో పార్టీ పిరాయింపులకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టింది.
ఇక తాజాగా హస్తం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కాంగ్రెస్ కీలక నేతలంతా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆపరేషన్ ఆకర్ష్ ను ఎలా అమలు చేయాలనే దానిపై చర్చించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థులను ఖరారు చేసిన హస్తం పార్టీ.. ఇంకా 58 మంది అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దాంతో ఇతర పార్టీల నుంచి పిరాయింపులకు పాల్పడే వారిని దృష్టిలో పెట్టుకొనే ఇకపై అభ్యర్థుల కేటాయింపు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరోవైపు జేడీ( ఎస్ ) కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఏంఐఏం మరియు బిఆర్‌ఎస్ మద్దతు కూడా జేడీ( ఎస్ ) కు ఉంది.
ఇక కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలపై అసంతృప్తిగా ఉన్న నేతలు కూడా జెడిఎస్ వైపు చూస్తున్నారట. మాజీ సిఎం కుమార స్వామి తాజాగా మాట్లాడుతూ కాంగ్రెస్ కు చెందిన 15 మంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని త్వరలోనే వాళ్ళు జేడీఎస్ లో చేరతారని చెప్పుకొచ్చారు. గతంలో జెడిఎస్ కు చెందిన వారిని కాంగ్రెస్ లాగేసుకుందని.. ఇప్పుడు అదే పార్టీకి చెందిన వాళ్ళు జెడిఎస్ వైపు చేస్తున్నారని కుమారస్వామి చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇదే గనుక నిజం అయితే కాంగ్రెస్ కు గట్టి షాక్ అనే చెప్పాలి. కాంగ్రెస్ కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నా నేపథ్యంలో ఆ పార్టీ నుంచి ఎమ్మేల్యేలు ఇతర పార్టీలోకి జంప్ అయితే ఆ పార్టీ కాన్ఫిడెన్స్ గట్టిగా బెబ్బతినే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్నికలవేళ పార్టీ పిరాయింపుకకు సంబంధించిన అంశం ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
ఇవి కూడా చదవండి..