కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. జేడీఎస్ సైతం తామేమి తక్కువ తినలేదని ఈ రెండు పార్టీలకు చెమటలు పట్టేలా ప్రచార పర్వానికి తెరలేపగా హంగ్ వస్తే ఈ పార్టీనే కీలకం కానుంది. ఇక టికెట్ దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.
Also Read:సలార్ ఒకటి కాదు రెండు భాగాలు..!
ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ 40 మంది పేర్లతో స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ప్రకటించింది. ఇందులో ఎంపీ తేజస్వీ సూర్య పేరు లేదు. బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడిగా, కర్ణాటక నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు చోటు దక్కకపోవటంతో ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, వివిధ రాష్ట్రాలు, కేంద్ర నుంచి పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. . వీరిలో తెలంగాణ రాష్ట్రంకు చెందిన బీజేపీ నేతలు కూడా ఉన్నారు. అయితే సూర్యను తప్పించడం అనేది పార్టీలో అతని పట్ల ప్రతికూల దృక్పథానికి సంకేతం కాదని పేర్కొంటున్నారు.
Also Read:‘బన్నీ క్లోజ్ ఫ్రెండ్’ తో రష్మిక