కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి మోడీ స్పందించారు. కర్ణాటకలో బీజేపీ విధానమైన అభివృద్ధి అజెండాకు మద్దతు తెలుపుతూ తమ పార్టీని కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరింపజేసిన సోదరి, సోదరిమణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తూ బీజేపీని గెలిపించిన కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ లో పేర్కొన్నారు.
I thank my sisters and brothers of Karnataka for steadfastly supporting the BJP’s development agenda and making BJP the single largest party in the state. I salute the stupendous work of @BJP4Karnataka Karyakartas who toiled round the clock and worked for the party.
— Narendra Modi (@narendramodi) May 15, 2018
కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 78 స్థానల్లో గెలుపొందిన కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుపొందిన జేడీఎస్ కి పూర్తి మద్దతు ప్రకటించింది. ఎలాగైనా… బీజేపీని కర్ణాటకలో అధికారంలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతో జేడీఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. మరోవైపు కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తన వ్యూహానికి పదును పెడుతోంది. కొత్త వ్యూహాలను అమలు చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రేపు కర్ణాటక రానున్నారు. రేపు సాయంత్రానికి కర్ణాకటకు అమిత్ షా చేరుకోనున్నారు.
ఇక ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్ ని కలిశారు. రేవణ్ణతో పాటు 12 మంది ఎమ్మెల్యే ల మద్దతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ని కోరిన యడ్యూరప్ప. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు… కావల్సిన బలనీరుపణకు యడ్డీకి గవర్నర్ వారం రోజుల సమయం ఇచ్చారు.