మే 12 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు..

224
Karnataka election 2018 dates announced highlights
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మే 12న ఎన్నికల పోలింగ్ జరగనుండగా మే 15న ఫలితాలు వెలువడనున్నాయి. అన్నిస్ధానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల ప్రధానాధికారి ఓపి రావత్ తెలిపారు. మొత్తం 224 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

ఏప్రిల్ 24వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 27ను చివరి తేదీగా నిర్ణయించారు. అయితే కర్నాటక ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం వెల్లడించాడానికి ముందే బిజెపి సోషల్ మీడియాలో తేదీలను ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై తప్పకుండా విచారణ జరిపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రావత్ పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఘటనలు ఏమైనా ఉంటే వాటిని హైలైట్ చేయాలని ఈసీ మీడియాను కోరింది.

మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నాయి. దీంతో పాటు రాహుల్ వినూత్న శైలీలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ గెలుపుకు కృషిచేస్తున్నారు.

- Advertisement -