కళ్యాణలక్ష్మీ పథకం అద్భుతం…

220
Farmers suicides reduced says kcr
- Advertisement -

నిరుపేద ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ పథకం అద్భుతమని తెలిపారు సీఎం కేసీఆర్. ద్రవ్యవినియమ బిల్లు సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం తెలంగాణ ఏర్పడిన సమయంలో ఒక రకమైన అనిశ్చితిలో ఉన్నామని…అలాంటి సమయంలోనే కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా రూ.51 వేలు ఇస్తామంటే అంతా విమర్శించారని కానీ నేడు ఈ పథకం ద్వారా లక్ష రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.

జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ ఆదాయం ఎక్కువని తెలిపారు సీఎం. 19 వేల ఎకరాల్లో అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు చేయబోతున్నామని..వేలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఫార్మాసిటీని అడ్డుకోవద్దని హితవు పలికిన కేసీఆర్….అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా ఓట్లు రావన్నారు.

రైతులకు ఏ ప్రభుత్వమైన సహాయ కార్యక్రమాలు మాత్రమే చేపడతాయని….రైతులకు పరిహారం చెల్లించాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నారు. లక్ష ఎకరాలు పంట నష్టపోతే.. ఏ ప్రభుత్వమైనా ఇస్తుందా? అని ప్రశ్నించారు. పంటలు నష్టపోతే పూర్తి పరిహారం ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

అవినీతి రహిత తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని తెలిపిన కేసీఆర్…. గతంలో కాంట్రాక్టులు చేపడితే అవినీతి, ముందుస్తు చెల్లింపులు జరిగేవి అని గుర్తు చేశారు. కాంట్రాక్టుల విషయంలో మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు, ఈపీసీలు రద్దు చేశామన్నారు. పూర్తి పారదర్శకతో ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

- Advertisement -