దేశవ్యాప్తంగా ఆసక్తిరంగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.ఇక ఉదయమే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో నిల్చున్న వారందరికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. ఇక తొలిసారి ప్రయోగాత్మకంగా 80 ఏళ్లు పై బడిన వారికి వికలాంగులకు ఇంటి నుండే ఓటు వేసే అవకాశం కల్పించారు.
Also Read:Telangana:నేడే పది ఫలితాలు
మొత్తం ఒకే దశలో 224 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుండగా 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సీఎం బొమ్మై (బీజేపీ) శింగావ్ నుంచి, మాజీ సీఎంలు సిద్ధరామయ్య(కాంగ్రెస్) వరుణ నుంచి, శెట్టర్ (కాంగ్రెస్) హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్ నుంచి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (జేడీఎస్) చెన్నపట్టణ నుంచి బరిలో నిలిచారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Also Read:పిక్ టాక్ : కుర్ర భామ కుమ్మేసింది
ఇక కర్ణాటక ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు నగదు, వస్తువుల రూపంలో రూ.375.61 కోట్ల మేర జప్తులు చేసింది. ఇందులో రూ.147.46 కోట్ల నగదు, రూ.83.66 కోట్ల విలువ చేసే 22 లక్షల లీటర్ల మద్యం, రూ.23.67 కోట్ల మాదకద్రవ్యాలు, రూ.96.60 కోట్ల లోహాలు, రూ.24.21 కోట్ల తాయిలాలు ఉన్నాయి.

