ముగిసిన కర్ణాటక పోలింగ్‌

40
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు తలెత్తకుండా ముగిసాయి. సాయంత్రం 5గంటల వరకు 66శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి పలు బూత్‌లలో ఓటర్లు క్యూలైన్‌లలో నిలబడి ఉన్నారు. దాంతో క్యూలైన్లో నిలబడి ఉన్నవారందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.

Also Read: మూడో సారి కే‌సి‌ఆర్ ను సి‌ఎం చేద్దాం !

కాగా గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో 72.13శాతం పోలింగ్ నమోదైంది. అనంతరం భద్రతా సిబ్బంది మధ్య రాష్ట్రంలోని ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలోకి భద్రపరిచారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. తాజాగా ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకారం రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నాయి. అయితే ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా.

Also Read: కే‌సి‌ఆర్ ఎఫెక్ట్.. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ !

- Advertisement -