కోల్ ‘కథ’ ముగిసింది…

228
Karn, Bumrah stub KKR to seal final spot
- Advertisement -

ఐపీఎల్‌-10 తొలి క్వాలిఫయర్‌ పోరునే మళ్లీ చూడబోతున్నాం. ఫైనల్లోనూ పుణె సూపర్‌జెయింట్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లే తలపడబోతున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో పుణె చేతిలో షాక్‌ తిన్న ముంబయి.. ఫైనల్‌ చేరేందుకు లభించిన రెండో అవకాశాన్ని వదులుకోలేదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏకపక్షంగా సాగిన రెండో క్వాలిఫయర్లో ముంబయి.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘనవిజయం సాధించింది.

రెండో క్వాలిఫయర్  లో ఆల్ రౌండ్ ప్రతిభతో ముంబై ఇండియన్స్ దుమ్మురేపింది. కోల్ కతా నైట్ రైడర్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. తోలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 107 పరుగులకే అలౌట్ అయిపోయింది. దీంతో 108పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై లక్ష్యాన్ని ఈజీగా చేధించింది. 14.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసిన ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కృనాల్ పాండ్య (45) అద్భుతంగా రాణించి నాటౌట్ గా నిలిచాడు. అంతకు ముందు రోహిత్ శర్మ (26) చెలరేగి బ్యాటింగ్ చేశాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే ఫైనల్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

Karn, Bumrah stub KKR to seal final spot
తొలుత  టాస్‌ గెలిచిన ముంబయి సైతం మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ ఎంచుకుంది. ఆ నిర్ణయం సరైందే అని రుజువు చేస్తూ ముంబయి బౌలర్లు చెలరేగారు. కోల్‌కతా బ్యాటింగ్‌కు అత్యంత కీలకమైన విధ్వంసక ఓపెనర్లు క్రిస్‌ లిన్‌ (4), సునీల్‌ నరైన్‌ (10)లను త్వరగా పెవిలియన్‌ చేర్చడంతో బౌలర్ల పని తేలికైంది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో లిన్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో పొలార్డ్‌ చేతికి చిక్కగా.. మలింగ బౌలింగ్‌లో ఒక సిక్సర్‌ బాదిన నరైన్‌, తర్వాత కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్‌ ఆడబోయి స్టంపౌటైపోయాడు. ఇక అక్కడి నుంచి కోల్‌కతా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. బుమ్రా, కర్ణ్‌ రెండు వైపులా ఒత్తిడి పెంచడంతో క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. ఉతప్ప (1) వచ్చీ రాగానే బుమ్రా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా.. గంభీర్‌ (12) కూడా కర్ణ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పాండ్యకు చిక్కాడు. గ్రాండ్‌హోమ్‌ తొలి బంతికే డకౌటైపోయాడు.

వాళ్లిద్దరూ నిలిచినా..: 7 ఓవర్లకు నైట్‌రైడర్స్‌ 5/31తో నిలిచింది. ఈ దశలో కోల్‌కతా 100 స్కోరు చేయడమూ అసాధ్యంగానే కనిపించింది. ఐతే ఇషాంక్‌ జగ్గి (28; 31 బంతుల్లో 3×4), సూర్యకుమార్‌ యాదవ్‌ (31; 25 బంతుల్లో 2×4, 1×6) పోరాడటంతో కోల్‌కతా కొంచెం కోలుకుంది. 15వ ఓవర్లో 87/5కి చేరుకున్న ఆ జట్టు.. 130 దాటేలా కనిపించింది. కానీ క్రీజులో కుదురుకున్న జగ్గి, సూర్యకుమార్‌ భారీ షాట్లకు ప్రయత్నించి వెనుదిరగడంతో నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ మళ్లీ గాడి తప్పింది. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో ఇంకో 7 బంతులుండగానే 107 పరుగుల వద్ద కోల్‌కతా ఇన్నింగ్స్‌కు తెరపడింది.

- Advertisement -