ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు

39
rs praveen

స్వచ్చంద పదవీ విరమణ చేసిన మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్‌ మున్సిఫ్‌ జడ్డి ఆదేశాలు జారీ చేశారు. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం… ఈ మేరకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌పై కేసు నమోదుకు కరీంనగర్‌ మూడో పట్టణ పోలీసులకు మున్సిఫ్‌ కోర్టు జడ్డి ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.