ఈటలకు షాక్…టీఆర్ఎస్‌కే ఓటు అంటున్న ప్రజలు!

168
etela

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు షాక్ తగిలింది. ఉప ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా అప్పుడే హుజురాబాద్‌లో ఎలక్షన్స్ వేడి రాజుకుంది. ఈటల పాదయాత్ర మొదలు పెట్టగా టీఆర్ఎస్ గ్రామాల వారీగా ఇంచార్జీలను నియమించి దూసుకుపోతోంది.

ఇక ఈటల నాయకత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వస్తుండగా తాజాగా ఆయనకు మరో షాక్ తగిలింది. వీణవంక మండలం ఎలబాక గ్రామంలో ప్రజలు ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల పంపిన గోడగడియారాలను గ్రామస్తులు పగలకొట్టారు. తమ గ్రామంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని కేసీఆర్ కే తమ ఓటు వేస్తామంటూ నినాదాలు చేశారు. ఎలబాక కాలనీ వాసులందరూ కలిసి కారు గుర్తుకు ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఇక ఇల్లందకుంటలోనూ ఈటల అనుచరులు కారెక్కారు. ఇల్లందకుంట మండలం ఎంపీపీ పావని, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, ముగ్గురు సర్పంచ్‌లు.. మండల ఇంచార్జ్, ఎమ్మెల్యే రవి శంకర్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు.