పుట్టిన రోజున మొక్కలు నాటిన కరీంనగర్ మేయర్..

160
Karimnagar Mayor

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నేడు పుట్టినరోజు జరువుకుంటున్న కరీంనగర్ మేయర్ వై.సునీల్ రావు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కేసీఆర్ గారి మానస పుత్రిక తెలంగాణకు హరితహారంకి సపోర్ట్‌గా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంతో దేశంలో అందరితో మొక్కలు నాటే విధంగా చేసిన ఘనత రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిది అన్నారు.

శుభకార్యాలు ఏదయినా మొక్కను నాటేలా చేశారు మన ఎంపీ సంతోష్ గారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ మొక్కలతోనే ఇంకా స్మార్ట్‌గా ఉంటుంది. అందుకే కరీంనగర్ అంతటా ఇంకా మొక్కలు బాగా నాటి గ్రీన్ సిటీగా మార్చేలా కృషి చేస్తాము అని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని జిల్లా వ్యాప్తంగా విస్తరించేలా తన వంతు సహకారం అందిస్తామన్నారు సునీల్‌ రావు.