భారీ వర్షాలు…పొంగిపొర్లుతున్న వాగులు

378
rain
- Advertisement -

కరీంనగర్ జిల్లాఎల్ఎండీ రిజర్వాయర్ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి పొంగి పొర్లుతూ వాగుల్లో కలుస్తున్నాయి. వాగులు నిండుగా ప్రవహిస్తూ రిజర్వాయర్లలోకి వచ్చి చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి నీరు భారీగా వచ్చి చేరుతుంది.

భారీ వర్షాలతో సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోని పలు మండలాల్లో చెరువులు మత్తళ్లు దూకడంతో నీరంతా మోయతుమ్మెద వాగులో చేరి ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి ప్రవహిస్తోంది.చెరువులు, కుంటలు నిండి పొంగి పొర్లుతూ వాగుల్లోకి చేరి ప్రవహిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్ఎండీ రిజర్వాయర్ లో నీటి మట్టం రోజురోజుకు పెరుగుతుంది. రాష్ర్టంలోని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ లోని పలు ప్రాంతాలకు సాగునీటిని అందించే ఎల్ఎండీ రిజర్వాయర్ సగానికి చేరుకుంది.

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో చెరువులు నిండి మత్తళ్లు దూకుతుండగా నీరంతా మోయతుమ్మెద వాగులో వచ్చి చేరి నిండుగా ప్రవహిస్తోంది. మోయతుమ్మద వాగు ద్వారా సుమారు యాభై వేలు క్యూసెక్కుల నీరు ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి వచ్చి చేరుతుంది. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్ఎండీ రిజర్వాయర్ 12 టీఎంసీలకు చేరుకుంది. మూడు రోజుల క్రితం 9.47 టీఎంసీల నీరున్న ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి రెండున్నర టీఎంసీల నీరు మూడు రోజుల్లో వచ్చి చేరింది. నీటి ప్రవాహం ఇలాగే ఉంటే రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎల్ఎండీకి నీరు వచ్చి చేరుతుందని ఎస్ఈ శివకుమార్ తెలిపారు. ఈఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఈలు ప్రతీ గంటకోసారి నీటి నిల్వలను పరిశీలిస్తూ సీఎంవో ఆఫీసుకు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాల కారణంగా ఎల్ఎండీ దిగువ ఆ యకట్టు రైతుల కోరిక మేరకు నీటి విడుదలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.

- Advertisement -