సీఎం కేసీఆర్ వెంటే నడుస్తా- రవిందర్ సింగ్

105
- Advertisement -

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశానని కరీంనగర్ మాజీ మేయర్ రవిందర్ సింగ్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్ తనను పిలిచారని, సీఎం పిలుపుమేరకు వెళ్లానని తెలిపారు. నాతో సుదీర్ఘంగా పలు విషయాలు చర్చించిన సీఎం కేసీఆర్.. తనతో ఉద్యమంలో చాలా కాలం పని చేశావు అని తనతో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో ముందుకుపోవాలని కోరడంతో తను మళ్లీ టిఆర్ఎస్‌లో కొనసాగుతానని స్పష్టం చేశారు.

ప్రత్యేక రాష్ట్రం కొరకు ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను గుర్తించాలని సీఎంను కోరానని రవిందర్ సింగ్ చెప్పారు. దానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి ఉద్యమ కాలంలో పనిచేసిన వారి పేర్లను గుర్తించి తనకు అందించాలని తెలిపినట్టు రవిందర్ సింగ్ తెలిపారు. స్మార్ట్ సిటీ రోడ్డు పనుల్లో నాణ్యతపై నాసిరకంగా ఉందని చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని స్మార్ట్ సిటీ పనుల నాణ్యతను కూడా సీఎంకు వివరించాలని రానున్న రోజుల్లో రోడ్డు పనుల్లో నాణ్యతలేని ఇసుకపై చేస్తున్న పోరాటం ఆగదని రాష్ట్ర అభివృద్ధిలో సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో మళ్లీ నడుస్తానని స్పష్టం చేశారు రవిందర్ సింగ్.

- Advertisement -