కరోనా జాగ్రత్తలు…అందరిని ఆశ్చర్య పరుస్తున్న వ్యాపారి

204
karimnagar corona
- Advertisement -

కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి లోని ఓ వ్యాపారి కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. తన సూపర్ మార్కెట్ కు వచ్చే కస్టమర్లకు ఇచ్చే డబ్బును డెటాల్ నీళ్లలో కడిగి తీసుకుంటున్నాడు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కస్టమర్లు ఎంతో నమ్మకంతో తన షాప్ కు వస్తున్నారని వ్యాపారి అంటున్నారు.

జిల్లాలో రోజురోజుకు పెరిగి పోతున్న కరోనా కేసుల పట్ల షాపు వ్యాపారి తీసుకుంటున్న జాగ్రత్తలు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. షాప్ కు వచ్చే వారిని కూడా శానిటేషన్ చేస్తుండటంతో సూపర్ మార్కెట్ కు వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ దశకు చేరుకుందని నిపుణులు హెచ్చరిస్తున్నా వేళ షాప్ ఓనర్ ముందు జాగ్రత్త చర్యలు కస్టమర్లకు కాస్త ధైర్యాన్ని ఇస్తున్నాయని చెప్పారు.

కస్టమర్ల సంతృప్తే తన వ్యాపారాన్ని ముందుకు తీసుకు పోతుందని షాపు ఓనర్ చెబుతున్నారు. మొత్తంగా షాపు ఓనర్ తీసుకుంటున్న మందు జాగ్రత్తలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -