లిప్‌లాక్‌లో కరీనా రెచ్చిపోయింది అందుకే..

311
Kareena Kapoor Khan's hottest lip locks on screen
- Advertisement -

సినిమా అన్నాక రొమాన్స్‌ సీన్స్‌, ముద్దు సీన్స్‌ కామన్‌. ఒక్కోసారి ఇలాంటి స్పైసీ సీన్లలో రెచ్చిపోతేనే ఆఫర్లకు ఆఫర్లు పేరుకు పేరు. అయితే పెళ్ళికి  ముందు హీరోయిన్స్ ఇలాంటి సీన్లకి నో చెప్పరు. ఎందుకంటే..టాప్‌ హీరోయిన్ గా ఎదగాలనే ఆశతో వచ్చిన ఆఫర్లను వచ్చినట్టుగా ఓప్పేసుకుంటారు.

అంతేకాకుండా మసాలా సీన్స్‌ లో రెచ్చిపోతే..గ్లామర్‌ రోల్స్‌ కి ఢోకానే ఉండదు. అయితే ఇదంతా పెళ్ళికి ముందేనా? అంటే..చెప్పలేము. పెళ్ళి తర్వాత ముద్దు సీన్లకి నో చెప్పిన వారు, ఇప్పుడు దేనికైనా రెడీ అంటున్నారు. ఇదే లిస్ట్‌ లో బాలీవుడ్‌ బ్యూటీ కరీనాకపూర్‌ చేరిపోయింది.

 Kareena Kapoor Khan's hottest lip locks on screen

కరీనా-సైఫ్‌ అలీఖాన్‌ పెళ్ళి సమయంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారట . అప్పటికి కరీనా చేతి నిండా అవకాశాలు కలిగిన హీరోయిన్. సైఫ్ కూడా ఫుల్ బిజీగానే ఉన్నారు. ఆ సమయంలో వీరిరువురి వివాహం అయ్యింది. వివాహం అయ్యాకా.. కొన్ని పరిమితులు పెట్టుకోవాలని అనుకున్నారట.. ప్రత్యేకించి ముద్దు సీన్లలో నటించడం విషయంలో వీరు షరతులు పెట్టుకున్నారట. ఇకపై ఏ సినిమాలో అయినా, ఎంత ఒత్తిడి వచ్చినా.. ముద్దు సీన్లలో నటించకూడదని ఒక మాట అనుకున్నారట.

 Kareena Kapoor Khan's hottest lip locks on screen

కేవలం కరీనా విషయంలోనే కాదు, ఈ షరతు సైఫ్ కు కూడా వర్తిస్తుంది. వివాహం అయ్యాకా నటనను కొనసాగించిన ఇద్దరూ.. కొంత కాలం ముద్దు సీన్లకు అయితే దూరంగానే ఉన్నారు. కానీ కరీనా ఎక్కువకాలం ఆగలేకపోయిందనుకుంటా.. ‘కి అండ్ కా’ సినిమాలో కరీనా రెచ్చిపోయింది. తనకన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో చాలా ఘాటైన రొమాన్స్ చేసిందామె. అలాగే అక్కడ నుంచి సైఫ్ లో కూడా మార్పు వచ్చింది. ముద్దు సీన్లలో నటించడం మొదలుపెట్టాడు.

 Kareena Kapoor Khan's hottest lip locks on screen

మరి వివాహ సమయంలో.. నటనకు ఓకే కానీ, ముద్దు సీన్లకు నో.. అనుకున్న ఈ దంపతులు తాము చేసుకున్న ఒప్పందాన్ని తామే ఉల్లంగించడం వెనుక కథేమిటి? అంటే.. దాని వెనుక సైఫ్ కూతురు సారా సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది.

థర్డ్ పర్సన్ తో మూతి ముద్దులు వద్దు అనుకున్న.. వారి ఒప్పందాన్ని కేవలం నిజజీవితానికి పరిమితం చేసుకోవాలని, తెరపై ముద్దు సీన్లలో నటించడం మానొద్దని సారా తండ్రికి, పిన్నికి సూచించిందట. దీంతో.. వారిలో మార్పు వచ్చిందట. ఆపై ‘కి అండ్ కా’ లో కరీనా రెచ్చిపోవడానికి కారణం కూడా సారా సూచనే అని తెలుస్తోంది. మొత్తానికి పెళ్ళి తర్వాత ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే రేంజ్‌లో రెచ్చపోయింది కరీనా.

 

- Advertisement -