టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా..

58

దక్షిణాఫ్రికా-భార‌త్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య‌ మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి మ్యాచ్ జ‌రుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆతిథ్య జ‌ట్టుతో భార‌త్ మూడు టెస్టుల‌తో పాటు మూడు వ‌న్డే మ్యాచులు ఆడ‌నుంది.

విదేశాల్లో ముందుగా బ్యాటింగ్ చేసి భారీగా పరుగులు చేయడమే తమ బలమని, పిచ్ కూడా తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నాడు విరాట్ కోహ్లీ… సౌతాఫ్రికా గడ్డపై ఆడటం సవాల్‌తో కూడుకున్నదని, ప్రత్యర్థి జట్టు ఎప్పటికి బలంగానే ఉంటుందని, వారికి ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసున్నాడు.

తుది జట్లు

భారత్‌: కేఎల్ రాహుల్, మయాంక్‌ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానే, రిషభ్‌ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌.

సౌతాఫ్రికా: డీన్‌ ఎల్గర్‌ (కెప్టెన్‌), మార్క్‌రమ్, కీగన్‌ పీటర్సన్, వాన్‌ డెర్‌ డసెన్, టెంబా బవుమా, క్వింటన్ డికాక్, వియాన్‌ మల్డర్, కేశవ్‌ మహారాజ్, కగిసో రబడా, లుంగి ఎన్‌గిడి, మార్కో జాన్సెన్