సీఎం కేసీఆర్‌కు ఆశాల ధన్యవాదాలు..

19
aasha

ఆశా వర్కర్లు,శానిటేషన్, పబ్లిక్ హెల్త్ వర్కర్లు,పారిశుద్ధ్య కార్మికుల జీతాలను 30 శాతం పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు ఆశావర్కర్లు.

వైద్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు…కరోనా థర్డ్ వేవ్‌పై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించగా ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆశాలు. సంకాంత్రి పండుగ సందర్బంగా ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు రుణపడి ఉంటామని ఆశా కార్యకర్తలు టెలి కాన్ఫరెన్స్లో ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రోత్సాహంతో మరింత బాగా పని చేస్తామని, ప్రజల మన్ననలు పొందేలా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

గత ప్రభుత్వాల హయాంలో పారితోషకం పెంపు కోసం ఆశా కార్యకర్తలు ధర్నాలు చేసేవారు, ఇందిరాపార్క్ వద్ద లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితులు ఉండేవి. గుర్రాలతో తొక్కించిన సందర్భాలు ఉన్నాయి. ఆశాల సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మరోసారి ౩౦ శాతం పారితోషకం పెంచారన్నారు మంత్రి హరీశ్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆశాలకు సూచించారు.