రాజమౌళి కట్టప్పతో ‘బాహుబలి’ని చంపించి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడా?’ అని ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ కన్క్లూజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సస్పెన్స్ వీడాలంటే ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే అని ఆర్కా మీడియా ఆంక్షలు విధించింది. దీంతో తమకు ఎంతో కొంత సమాధానం తెలిసినా కూడా బాహుబలి చిత్ర యూనిట్ ఆ విషయాన్ని రివీల్ చేయలేదు.
మరి దేశం మొత్తాన్ని ఒక ప్రశ్న వేధించడం మొదలు పెట్టింది.. 2015 నుండి అదే.. బహుబలిని కట్టప్పా ఎందుకు చంపాడు? దీని లో చాలా మంది తెలుసుకోవాలి అని అడిగిన వాళ్ళు కన్నా.. అర్ధంకాక అడిగినా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం వస్తుంది బాహుబలి 2 ఈ నెల ఏప్రిల్ 28న.
ఈ ప్రశ్న పైన జోక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది కూడా ఒక సార్కాస్టిక్ దోరణితో.. కాని వాళ్ళ మాట నెగ్గ లేదు. ఎందుకంటే మరి బాహుబలి ప్రభంజనం అటువంటిది. కానీ ఇప్పుడు ఆ నిజం తెలుసుకోవడానికి సమయం వచ్చింది. అయితే మొట్టమొదటిసారిగా ఆ సమాదానం మాత్రం హిందీ వారికే తెలుస్తుంది. ఈ సినిమాని హింది లో కరణ్ జోహర్ డిస్ట్రిబూట్ చేస్తున్నాడు కదా.. కాబట్టి బాహుబలి మొత్తం టీమ్ తో పాటుగా.. ఆ సినిమా క్రూ అండ్ కాస్ట్ తో హింది వర్షన్ బాహుబలి 2 స్పెషల్ స్క్రీనింగ్ ఏప్రియల్ 27 రాత్రినే వేస్తారట. కరణ్ జోహర్ మంచి ఫిల్మ్ మేకేరే కాదు పార్టీ బోయ్ కూడా మరి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన బహుబలికి పార్టీ ఇవ్వకుండా ఉంటాడా.అందుకే అక్కడ స్పెషల్ స్క్రీనింగ్. అందుకే ఫస్టు బాలీవుడ్ లో వేయిస్తున్నాడు.
సో.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో.. ముందుగా హిందీ వారికే తెలుస్తుందనమాట. కొన్ని గంటల గ్యాపులో మనకీ తెలుస్తుందిలే. చూద్దాం ఆ ఆన్సర్ ఎంత కన్విన్సింగ్ గా ఉండబోతుందో.