ఏసీబీ వలలో కాప్రా సర్కిల్ డిఈ మహాలక్ష్మీ..

61
acb rides

ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగళం చిక్కింది. బాధితుల నుండి లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్‌గా కాప్రా సర్కిల్ డీఈ మహాలక్ష్మి ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మల్లాపూర్ శివ స్వాతి హోటల్ లో రూ.20వేలు డిమాండ్ చేస్తుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు మహాలక్ష్మీ.

అవినీతి అధికారిని మల్లాపూర్ వార్డు కార్యాలయంలో విచారిస్తున్నారు అధికారులు. జిహెచ్ఎంసి స్వీపర్ సాలెమ్మ మృతి చెందగా ఆమె భర్తకు ఉద్యోగం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు మహాలక్ష్మీ. శివ స్వాతి హోటల్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా మహాలక్ష్మి ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.