భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిన సంవత్సరం 1983. కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచి నిలిచింది. ఈ నేపథ్యంలో కపిల్ బయోపిక్ తెరకెక్కుతుండగా ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. తాజాగా సినిమాకు సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది. జూన్ 4న సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగులో విడుదల చేస్తుండగా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయనున్నారు.విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మించిన కపిల్ బయోపిక్‌లో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ గా నటిస్తుండగా ఆయన భార్య పాత్ర దీపికా పదుకొనె చేయడం విశేషం.
సునీల్ గవాస్కర్ పాత్రలో తాహీర్ రాజ్ భాసిన్, సందీప్ పాటిల్ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్ పాటిల్, శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్ కిర్మాణిగా సాహిల్ ఖట్టర్, బల్వీందర్ సింగ్‌గా అమ్మీ విర్క్ కనిపించబోతున్నారు.