విజయ్‌తో ముంబై రోడ్లపై ఛార్మి చక్కర్లు..!

43
charmi

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్‌. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై ఛార్మి,పూరి నిర్మిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

తాజాగా సినిమా షూటింగ్ ముంబైలో జరుపుకుంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ గ్యాప్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఎక్కించుకొని బైక్ రైడ్‌కు వెళ్లింది ఛార్మి. ముంబయి రోడ్ల మీద టూ వీలర్ పై విజయ్‌తో చ‌క్క‌ర్లు కొట్టింది.

విజయ్‌తో రైడ్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఛార్మి…న‌న్ను న‌మ్మి నా బైక్ ఎక్కాడు. షూటింగ్ గ్యాప్‌లో ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టాం అని చెప్పుకొచ్చింది.