మార్చి 19న ‘చావుకబురు చల్లగా’

32
chavukaburu challaga

RX 100 సినిమాతో యూత్‌లో తనకంటూ తెచ్చుకున్న హీరో కార్తికేయ. తాజాగా కౌశిక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్ఫణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో చావు కబురు చల్లగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ‘బస్తీ బాలరాజు’ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

తాజాగా సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ‘కదిలే కాలాన్నడిగా’ అంటూ సాగే పాట ఈనెల 23న సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు విడుదల కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కార్తీకేయ సరసన లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా నటిస్తుండగా అనసూయ కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్చి19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.