రివ్యూ : కపటధారి

405
kapatadhaari
- Advertisement -

హీరో సుమంత్, ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం క‌ప‌ట‌ధారి . సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం, ఇదంజ‌గ‌త్‌ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు క‌ప‌ట‌ధారి అనే ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకువచ్చారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మించగా ‘కపటధారి’తో సుమంత్‌కు మ‌రో స‌క్సెస్ ద‌క్కిందా? లేదా? చూద్దాం..

క‌థ‌:

గౌత‌మ(సుమంత్‌) హైద‌రాబాద్‌లో ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్‌. పోలీస్‌గా ఏదో సాధించాల‌నుకునే గౌత‌మ్‌కి ట్రాఫిక్ నుంచి క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో వెళ్లాలనే ఆస‌క్తి ఉంటుంది. ఈ క్రమంలో ఓ ప్రాంతంలో మూడు అస్థి పంజ‌రాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. ఇందులో ఓ చిన్న పాప ఉండగా వారిని ఎవ‌రు చంపారో తెలుసుకోవాల‌నుకుంటాడు గౌత‌మ్‌. ఈ కేసులో పై అధికారులకు తెలవకుండా ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. ఈ కేసు ఇన్వెస్టిగేష‌న్ ఆఫీసర్ ఎందుకు తప్పుకుంటాడు…? రంగారావు కుటుంబాన్ని ఎవ‌రు చంపారు?..చివరికి హంతకుడిని గౌతమ్‌ పట్టుకున్నాడనేదే కథ..

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ సుమంత్,నటీనటులు. ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు సుమంత్. నందితా శ్వేత పాత్ర చాలా ప‌రిమిత‌మే అయినా, పాత్ర ప‌రిధి మేర‌కు చ‌క్క‌గానే న‌టించింది. కుటుంబాన్ని పోగొట్టుకుని బాధ‌ప‌డుతున్న రైట‌ర్డ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నాజ‌ర్‌, ప‌త్రిక ఎడిట‌ర్‌గా జ‌య‌ప్ర‌కాశ్ అద్భుతంగా నటించారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో లాజిక్స్ మిస్ అయ్యారు. ముఖ్య‌మంత్రి కాబోయే వ్య‌క్తిని ఓ ట్రాఫిక్ పోలీస్ బెదిరించ‌డం, విషం ఇచ్చి చంపేయ‌డం వంటి స‌న్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. కన్నడ రీమేక్ మూవీని పెద్దగా మార్పులు లేకుండా దించేశారు దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి. సైమ‌న్ కింగ్ సంగీతం పర్వాలేదు. ఎడిగింట్ బాగుంది. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

తీర్పు:

క‌న్న‌డ చిత్రం ‘కావ‌లుధారి’ రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం కపటధారి. న‌ల‌బై ఏళ్ల క్రితం క్రైమ్ డిపార్ట్‌మెంట్ వాళ్లు మూసేసిన కేసుని ఓ ట్రాఫిక్ ఎస్సై ఎలా డీల్ చేశాడ‌నేదే సినిమా క‌థాంశం. పెద్దగా ట్విస్ట్‌లు లేకుండా సాదాసీదాగా ఈ వారంలో ఓసారి చూడదగ్గ చిత్రం కపటధారి.

విడుదల తేదీ:19/02/2021
రేటింగ్: 2.5/5
న‌టీన‌టులు: సుమంత్‌, నందితా శ్వేత‌
సంగీతం: సైమ‌న్ కింగ్‌
నిర్మాత‌: ల‌లిత ధ‌నంజ‌య‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి

- Advertisement -