దేశంలో 24 గంటల్లో 13,193 కరోనా కేసులు..

44
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గముఖం పడుతునే ఉన్నాయి. గత 24 గంటల్లో 13,193 కరోనా కేసులు నమోదుకాగా 97 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 1,09,63,394లకు చేరాయి.

ప్రస్తుతం 1,39,542 యాక్టివ్ కేసులుండగా ఇందులో 1,06,67,741 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,56,111 మంది కరోనా ప్రభావంతో మరణించారు. ఇప్పటివరకు మొత్తం 1,01,88,007 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారని ఐసీఎంఆర్ వెల్లడించింది.