నేటి నుండి ఈ నెల 23 వరకు మీరట్ జిల్లాలో అన్ని స్కూల్స్ బంద్ ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. మీరట్‌లో కన్వర్ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెలవులు అన్ని బోర్డులకు చెందిన పాఠశాలలు మరియు కళాశాలలకూ వర్తిస్తాయి అని అధికారులు తెలిపారు.
సెలవుల సమయంలో ఏ స్కూల్/కళాశాల తెరిచి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం అని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కన్వర్ యాత్ర నేపథ్యంలో 5000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. CCTVలు, డ్రోన్‌ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. ఆలయాలు మరియు ప్రధాన రూట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంది.
కుంజ్, నోయిడా, బదర్పూర్, ఆగ్రా కెనాల్ రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ప్రయాణికులు DND ఫ్లైవే, అశ్రం రూట్లను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. కన్వర్ యాత్ర జూలై 11న ప్రారంభమై, శ్రావణ శివరాత్రి రోజైన జూలై 23న ముగియనుంది. భక్తుల రద్దీ మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని మీరట్ జిల్లా, అలాగే ఇతర ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read:వైసీపీ ఎంపీపై లుక్ అవుట్ నోటిసులు

